Friday, September 11, 2026
Home Politics State ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలా?

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలా?

0
16

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ హైద్రాబాద్ ఆగస్ట్ 28: ఆబాద్ పార్టీ” అద్యక్షుడు హస్సన్ షేక్ శుక్రవారం రోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో “టీచర్లపై నిఘా” పేరుతో వచ్చిన కథనం రాష్ట్రంలోని లక్షకు పైగా ఉన్న ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, వారిని సమాజంలో (బదనాం) చిన్న చూపు చేసే విదముగా ఈ వార్తా కథనం ఉంది. నూటికి నూరు శాతం ఉపాధ్యాయులందరూ పరిపూర్ణంగా పనిచేస్తున్నారని ఎవరూ అనడం లేదే విధులను అలసత్వంగా తీసుకునే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో అభ్యంతరం ఎవరికి లేదు. కానీ ప్రాతిపదిక లేని అంకెలు, నిరూపణ లేని ఆరోపణలతో మొత్తం ఉపాధ్యాయ వర్గానికే దురుద్దేశాలు అపాదిస్తూ కథనాలు రాయడం కానీ, రావడం కానీ ఎంతవరకు సమంజసం? 20 వేల మంది ఉపాద్యాయుల దూరప్రాంత ప్రయాణంకు అసలు బాధ్యులెవరు? ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే 20 వేల మంది ఉపాధ్యాయులు వందల కిలోమీటర్ల దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని, ప్రయాణ అలసట వల్ల బోధనపై శ్రద్ధ చూపలేకపోతున్నారని సదరు వార్తలో పేర్కొన్నారు.ఒక వేళ ఇదే నిజం అనుకుంటే మరి ఈ దుస్థితికి కారణం ఎవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.