Friday, September 11, 2026
Home People ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు .

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు .

0
12

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ ఆగస్టు 29గార్ల: స్థానికమండల కేంద్రంలోని విశ్వశాంతి విద్యాలయంలో శనివారం తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాలయం కరస్పాండెంట్ వడ్లమూడి దుర్గాప్రసాద్, బీరవెల్లి సంజీవరెడ్డి, లు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రిన్సిపల్ పసుపులేటి రమేష్, ఉపాధ్యాయులతో కలిసి తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషలో ఉండే తేనె వంటి మాధుర్యాన్ని భాష గొప్పదనాన్ని, అవసరాల ను వారు వివరించారు. అనంతరం తెలుగు బాష ప్రాముఖ్యతను, గొప్పదనాన్ని పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అందరిని అలరించారు. అనంతరం వారు విద్యాలయంలో తెలుగును బోధిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి మెమొంట్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.