Friday, September 11, 2026
Home People కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీని గద్దె దింపుద

కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీని గద్దె దింపుద

0
12

📰 Generate e-Paper Clip

దేశాన్ని పరిపాలించే హక్కు బీజేపీకి లేదు సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి

పరివర్తన ఆవాజ్ ఆగస్టు 29గార్ల: స్థానికమండల కేంద్రంలో ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా 3వ మహాసభలు శనివారంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్ల పురవీధుల్లో వందలాది మంది కార్మికులు, ప్రజలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరజీవి కామ్రేడ్ పోతుల నరసింహారావు ప్రాంగణంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఓమా బిక్షపతి జెండా ఎగురవేశారు.అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించారు..
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి,AITUC గార్ల మండల కార్యదర్శి మేదరమెట్ల గిరిప్రసాద్,వెలుగు శ్రావణ్ అధ్యక్షత బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసిన కేంద్ర ప్రభుత్వం, వాటిని 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి తెచ్చింది. కార్మిక సంఘాల అభిప్రాయం ప్రకారం ఈ కోడ్లు కార్మికుల సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, సామూహిక చర్చల హక్కు, పని పరిస్థితులు వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలను విస్తరించడం, శాశ్వత ఉద్యోగాల స్థానంలో అస్థిర ఉపాధి పెరగడం, కనీస వేతనాలు–సామాజిక భద్రతను సమర్థంగా అమలు చేయకపోవడం కార్మికులపై భారాన్ని పెంచుతున్నాయని విమర్శించారు. కార్మికుల భద్రత, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రత హక్కులను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఇతర స్కీం వర్కర్ల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని మేకల శ్రీనివాస్ అన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గౌరవ వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపు, అదనపు పనుల భారాన్ని తగ్గించడం వంటి డిమాండ్లపై కార్మిక సంఘాలు నిరంతరం పోరాడుతున్నాయి. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కనీస వేతనాలను పెంచాలని, పెండింగ్ వేతనాలు–బకాయిలను చెల్లించాలని, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు.. సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం – ఉద్యోగ భద్రత – సామాజిక భద్రత – పెన్షన్ – కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదాం – కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం అని అన్నారు..ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ AITUC జిల్లా కార్యదర్శి రేషపల్లి నవీన్,cpi గార్ల మండల కార్యదర్శి జంపాల వెంకన్న,AITUC గార్ల మండల కార్యదర్శి ధూపాటి జనార్ధన్,నర్రా శ్రావణ్,విరవెల్లి రవి,చిర్ర లక్ష్మీనసరమ్మ, అన్నం శ్రీనివాసరావు,బానోత్ పద్మ, అబ్దుల్ రహమాన్, భూక్య హరినాయక్,బిర్రు ఐలయ్య, లావుడ్య భీముడు, ధారవత్ వీరన్న,తండా శ్రీనాథ్, తండా సందీప్, సారిక శ్రీనివాస్, యాస వెంకన్న, మంద శంకర్, పుచ్చకాయల రజిని, కీసర సౌమ్యశ్రీ, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.