Friday, September 11, 2026
Home Uncategorized ఇల్లందు మండలం లో ఘనంగా సేవాలాల్ సేన 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు

ఇల్లందు మండలం లో ఘనంగా సేవాలాల్ సేన 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు

0
10

📰 Generate e-Paper Clip

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సేవాలాల్ సేన 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ మరియు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ పిలుపు మేరకు ఇల్లందు మండల అధ్యక్షుడు ఆంగోత్ ఆంజనేయులు నాయక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ముందుగా నాయకులు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బంజారా జాతి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం సేవాలాల్ సేన జెండాను ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సేవాలాల్ సేన ఆవిర్భవించి 12 ఏళ్లలో బంజారా గిరిజనుల కోసం అనేక విజయాలు సాధించిందని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ నాయకత్వంలో సాధించిన ప్రధాన విజయాలు:తండాలను గ్రామ పంచాయతీలుగా సాధించడం,10 శాతం రిజర్వేషన్ సాధన ,సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారిక వేడుకగా జరిపించడం,పోడుకు తోడు పాదయాత్ర ద్వారా గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇప్పించడం,ఏజెన్సీ డీఎస్సీ ద్వారా వందలాది మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇప్పించడం,ఈ విజయాలను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో జాతిపై వచ్చే సమస్యలను అధిగమించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షుడు ఆంగోత్ ఆంజనేయులు నాయక్, మాజీ సర్పంచ్ నూనావత్ తిరుపతి నాయక్, సేవాలాల్ సేన కార్యదర్శి బానోత్ వెంకన్న బాబు, సేవ్య తండా నాయకుడు ఆంగోత్ సేవ్య నాయక్, బాలాజీ తండా నాయకుడు బానోత్ మంగీలాల్, కూన్సత్ రమేష్ నాయక్, మోహన్, వీరన్న, రమేష్, లాలు, రవి, వెంకన్న, అశోక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.