Friday, September 11, 2026
Home People మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యలో రోడ్డు భద్రతా పై అవగాహన సదస్సు

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యలో రోడ్డు భద్రతా పై అవగాహన సదస్సు

0
5

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ వరంగల్ : వరంగల్ చింతల్ మైదానంలో రోడ్డు భద్రతా పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మిల్స్ కాలనీ si నిహారిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నిహారిక మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు వాహనదారుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అదే విధంగా కారు మరియు భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక ధరించాలిని,వాహనదారులు తమ వద్ద ఆర్‌సీ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL), పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాలిడ్ డాక్యుమెంట్లను ఎల్లప్పుడూ ఉంచుకోవాలి అన్నారు,అలాగే కేంద్ర ప్రభుత్వ రాహా వీర్ (Raha Veer) పథకం: రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే “గోల్డెన్ అవర్” (Golden Hour) లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే సామాజిక శ్రేయోభిలాషులకు (Good Samaritans) కేంద్ర ప్రభుత్వం ₹25,000 నగదు బహుమతి తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది అన్నారు,
పి.ఎం. రాహత్ (PM Rahat) పథకం: ప్రమాదంలో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ వైద్య సహాయం అందించేందుకు రూ. 1.5 లక్షల వరకు ఉచిత/నగదు రహిత వైద్య సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అన్నారు, ప్రమాద బాధితులను కాపాడేందుకు ముందుకు వచ్చే వారికి ఎలాంటి పోలీస్ లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉండవని, కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతకు సహకరించి ప్రాణాలను కాపాడాలని ఎస్.ఐ నిహారిక కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.