ఇల్లందు మండలం లో ఘనంగా సేవాలాల్ సేన 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సేవాలాల్ సేన 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ మరియు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ పిలుపు మేరకు ఇల్లందు మండల అధ్యక్షుడు ఆంగోత్ ఆంజనేయులు నాయక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ముందుగా నాయకులు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బంజారా జాతి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం సేవాలాల్ సేన జెండాను ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు...