Friday, September 11, 2026
Home People విమర్శలు కాదు.. అభివృద్ధి చేసి చూపించండి.. -కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

విమర్శలు కాదు.. అభివృద్ధి చేసి చూపించండి.. -కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

0
16

📰 Generate e-Paper Clip

-గంప గోవర్ధన్‌పై విమర్శలు సరికాదు.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా?

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి ప్రతినిధి  ఆగస్టు 29: కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలకు స్వస్తి పలికి కామారెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ నాయకులు హితవు పలికారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న డివైడర్ల మరమ్మతుల కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు కౌంటర్‌గా కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన విమర్శలపై బీఆర్‌ఎస్ నాయకులు శనివారం ఘాటుగా స్పందించారు. రాజకీయ విమర్శలు చేయడం సులభమని, అయితే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేసి చూపించడమే ముఖ్యమని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. గంప గోవర్ధన్‌పై విమర్శలు సరికాదు కామారెడ్డి అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ఆయన హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కామారెడ్డికి జిల్లా కేంద్ర హోదా రావడంతో పాటు కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. పట్టణంలో రహదారులు, స్ట్రీట్ లైట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కీలకంగా నిలిచాయని అన్నారు. అప్పట్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయని, వాటిని రాజకీయ విమర్శలతో చెరిపివేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.సమస్యలకు పరిష్కారం చూపాలి కామారెడ్డి పట్టణంలో వర్షాల సమయంలో నీటి ప్రవాహం, దెబ్బతిన్న డివైడర్లు, ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే రాజకీయ విమర్శలతో సమాధానం ఇవ్వకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కేవలం మీడియా సమావేశాలు నిర్వహించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డికి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. విమర్శలకు సమాధానం విమర్శలు కాదు.. అభివృద్ధి. ప్రజలకు అవసరమైన పనులు చేసి చూపించండి. అప్పుడు ప్రజలే ఎవరు అభివృద్ధి చేశారో నిర్ణయిస్తారు” అని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు స్వస్తి పలికి కామారెడ్డి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి పరస్పర విమర్శలకు దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, పట్టణ అభివృద్ధి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో కాసర్ల గోదావరి స్వామి, అరికెల ప్రభాకర్ యాదవ్, చెలిమెల భాను ప్రసాద్, కుంభాల రవి యాదవ్, మిర్జా ఆఫీజ్ బెగ్, లోలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.