Friday, September 11, 2026
Home People హైదరాబాద్‌లో ఘనంగా 15వ ఎడిషన్ హైదరాబాద్ మారథాన్

హైదరాబాద్‌లో ఘనంగా 15వ ఎడిషన్ హైదరాబాద్ మారథాన్

0
18

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌ పరివర్తన ఆవాజ్ :  హైదరాబాద్‌లో , ఆగస్టు 30, 2026 ఆదివారం, 15వ ఎడిషన్ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ మారథాన్‌లో భాగంగా హాఫ్ మారథాన్ 21.097 కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రన్నర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.ఈ సందర్భంగా కామారెడ్డి కు చెందిన జున్నొద్దీన్ అనే రన్నర్ హాఫ్ మారథాన్‌లో 21.097 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి, హైదరాబాద్ రన్నర్స్ తరఫున అందించిన మెడల్‌ను అందుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఇటువంటి మారథాన్‌లు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. పరుగుతో ఆరోగ్యం… ఆరోగ్యంతో ఆనందం… అనే సందేశాన్ని చాటుతూ హైదరాబాద్ మారథాన్ విజయవంతంగా కొనసాగింది. రన్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని జున్నొద్దీన్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.