Friday, September 11, 2026
Home Politics State రంజాన్ క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

రంజాన్ క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

0
49

📰 Generate e-Paper Clip

రంజాన్ క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

         కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు – మత సామరస్యంపై ఎస్పీ పిలుపు

{కామారెడ్డి, పరివర్తన అవాజ్}: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత భేదాలు లేకుండా ఐక్యమత్యంతో జీవించి సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించాలని సూచించారు. పోలీస్ వ్యవస్థలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి పండుగల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమిస్తూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, ఎస్ఐలు, ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు సోదరభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.