Friday, September 11, 2026
Home Politics శ్రీ పాండురంగ భజన మందిరంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం

శ్రీ పాండురంగ భజన మందిరంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం

0
47
IMG-20260319-WA1320

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్:-శ్రీ పాండురంగ భజన మందిరంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంభద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరంలో ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని సాయంకాలం పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.

దేవాలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరంలో జరిగే గ్రహ స్థితులు, పండుగలు, శుభ ముహూర్తాలు, ప్రజల జీవన విధానంపై వాటి ప్రభావం గురించి వివరించారు.

ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రద్ధగా వినడం జరిగింది. అనంతరం దేవాలయ అర్చకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంతో భజన మందిరం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.