Author: laxman RAO

 ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ పరివర్తన ఆవాజ్ కొత్తగూడెం జూన్ 02 :చర్మకారుల సంఘం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఎంజీ రోడ్డు లోని వుడ్ల్యాండ్ షూ షోరూంలో చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పెట్టల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపూడి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన చర్మకారుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వం చర్మకారుల సమస్యలు పరిష్కరించాలని, మౌలిక వసతులు కల్పించాలని, వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న తమకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని తెలిపారు. కొత్తగూడెం ఫుట్వేర్ అసోసియేషన్ సభ్యులందరికీ ఎస్సై చేతుల మీదగా మెమెంటోలు అందుకున్నారు. కార్యక్రమం అనంతరం ఎస్సై ప్రవీణ్ కుమార్ కి చర్మకారులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర…

Read More

పరివర్తన  అవాజ్ కొత్తగూడెం, మే 24భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జిల్లా తృతీయ మహాసభలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, యూనియన్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు హాజరై సభను విజయవంతం చేశారుమహాసభల్లో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు సమాజానికి మీడియా రంగం చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి బాధ్యతలను పాత్రికేయులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని అన్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వృత్తిపరమైన భద్రత, ప్రభుత్వ గుర్తింపు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో సమస్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు సంఘటితంగా ముందుకు రావాల్సిన…

Read More

పరివర్తన అవాజ్. కొత్తగూడెం, మే 16సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 7వ నెంబర్ బజారు, 15వ డివిజన్‌కు చెందిన లయన్ పగడాల నగేష్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం నూతన సెక్రటరీగా 2026-2027 సంవత్సరానికి జరిగిన క్లబ్ జనరల్ బాడీ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్‌లో నగేష్ గత కొంతకాలంగా వివిధ సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ క్లబ్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. విద్యార్థులకు విద్యా సహాయం, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, పేదలకు ఆర్థిక సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన చూపిన చొరవ సభ్యుల ప్రశంసలను అందుకుంది.నాయకత్వ లక్షణాలు, సేవాభావం, సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరినీ కలుపుకొని పనిచేసే తత్వం కారణంగానే నగేష్‌పై సభ్యులు పూర్తి విశ్వాసం ఉంచి…

Read More

  ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి సమన్యాయం చేయాలని డిమాండ్ పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల (TEAM) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “మాలల న్యాయ పోరాట సభ” విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సభకు శనగ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాలల రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. దాసరి చెన్నకేశవులు, జేఎన్‌టీయూహెచ్ జేఏసీ చైర్మన్ డా. రంజిత్ కుమార్ మందా, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య డా. మద్దెల శివకుమార్, మాలమహానాడు సెక్రటరీ జనరల్ మధుసూదన్ (చిన్ని), మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, నవతన్ తదితరులు పాల్గొన్నారు.అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేటర్లు పోలుమూరి ధనలక్ష్మి, నామా కీర్తి, గుర్రం వెంకటేశ్వర్లు, ఆకునూరి సుప్రియ, మద్దాల హరిత, కాల్వ భాస్కర్,…

Read More

కొత్తగూడెంలో కరపత్రం ఆవిష్కరణ – ఎస్సీ ఉపవర్గీకరణపై మాల సంఘాల ఐక్య స్వరం పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం ఎస్సీ ఉపవర్గీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మాల సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మే 10న కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న “మాలల న్యాయపోరాట సభ”కు సంబంధించిన కరపత్రాన్ని గురువారం సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంతో 59 షెడ్యూల్ కులాలను కులాల ఆధారంగా వర్గీకరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా ఎంపిరికల్ డేటా సేకరించి ఎస్సీల ఉపవర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణలోని అన్ని మాల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి న్యాయపోరాటాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని…

Read More

  కొత్తగూడెం/పాల్వంచ, మే 3: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (యూ జి) ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఉదయం నుంచే కేంద్రాలకు చేరుకుని, నిర్దేశిత నిబంధనల ప్రకారం తనిఖీలు పూర్తి చేసి హాళ్లలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ తనిఖీలు కఠినంగా నిర్వహించడంతో పరీక్షలు సవ్యంగా జరిగాయి. పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థులు కేంద్రాల నుండి బయటకు రాగా, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కొంతకాలంగా పిల్లల చదువులు, పరీక్షలపై ఉన్న ఒత్తిడి తగ్గిందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు కూడా పరీక్ష పేపర్ సగటుగా ఉందని, కొంత భాగం కఠినంగా ఉన్నప్పటికీ మొత్తం మీద సమతుల్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరమని తెలిపారు. మొత్తం మీద ఈ…

Read More

    పాల్వంచ/కొత్తగూడెం, మే 3: దేశవ్యాప్తంగా నేడు జరుగుతున్న నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష పాల్వంచలోని టీజీఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్ జూనియర్ కాలేజీ (గురుకుల పాఠశాల)లో పకడ్బందీగా జరిగింది. ఉదయం నుంచే పరీక్ష కేంద్రం వద్ద సందడి నెలకొంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు కూడా ముందస్తుగా వచ్చి, పరీక్ష నిబంధనలను పాటిస్తూ తమ పిల్లలను సెంటర్‌లోకి పంపించారు. అధికారులు విద్యార్థుల తనిఖీలు కఠినంగా నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో సాగినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా పాల్వంచ గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష సజావుగా, నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడింది.

Read More

పరివర్తన్ అవాజ్ ,కొత్తగూడెం హైదరాబాద్‌లోని వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ (డబల్యూ ఈవో) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా దుర్గారాసి సతీష్‌ను డబల్యూ ఈవో నియమించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు సి.హెచ్. భద్రం నియామక పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో భద్రం మాట్లాడుతూ, “పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే మనలను పర్యావరణం రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి” అని తెలిపారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.తదుపరి, దుర్గారాసి సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన భద్రం గారికి మరియు సంస్థ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. “బాన్ ప్లాస్టిక్ – సేవ్ నేచర్” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటి, పర్యావరణ రక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని, ఒక రక్షకుడిగా పనిచేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పరివర్తన అవాజ్,కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొత్తగూడెం 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఖండించారు..పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ప్రజాస్వామ్య ప్రక్రియను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా తప్పు అని ఆమె ఖండించారు. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడం అని పేర్కొన్నారు.అప్పటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఏర్పాటుచేసిందని తెలిపారు. అలాంటి నిర్ణయాన్ని తక్కువ చేసి మాట్లాడటం బీజేపీ నాయకుల అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు.తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన తేజస్వీ సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, యావత్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సుప్రియ డిమాండ్…

Read More

  సన్మానం చేసిన మనం దినపత్రిక విలేకరులు శనగ లక్ష్మణ్, చదలవాడ సూరి పరివర్తన ఆవాజ్ ,కొత్తగూడెం చుంచుపల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వో నాగరాజును స్థానిక ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మనం దినపత్రిక విలేకరులు శనగ లక్ష్మణ్, చదలవాడ సూరి కలిసి నాగరాజుకు సాలువా కప్పి అభినందనలు తెలిపారు.మండల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని వారు కోరారు. ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో నాగరాజు మాట్లాడుతూ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో మండలంలో పారదర్శక పాలన అందిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More