Author: laxman RAO
పరివర్తన అవాజ్,కొత్తగూడెం స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా ది. 19-3-2026 గురువారం నుండి ది. 28-3-2026 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్ధం సకల ప్రజలకు సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్యము కలుగాలనే సంకల్పముతో పంచాయతన సహితముగా కోటికుంకుమార్చనా మహాయాగమును నిర్వహించటం జరుగుతున్నది. కావున భక్త జనులందరూ ఈ దైవ కార్యక్రమములో పాల్గొని అమ్మవారిని దర్శించి, పూజించి, సేవించి జగదాంబ అనుగ్రహమునకు పాత్రులై సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద ఐశ్వర్యములు పొందగలరు. పంచాయతన సహిత కోటికుంకుమార్చన మహాయాగం బ్రహ్మశ్రీ కొండవేటి దత్తాత్రేయ శర్మ మంత్ర శాస్త్రపండితులు వారి ఆధ్వర్యములో నిర్వహించబడును. కోటి కుంకుమార్చన నిర్వహించు ప్రదేశం : శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం (శివాలయం) ప్రగతి నగర్, కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాగమును విజయవంతం చేయగలరని మనవి.
పరివర్తన ఆవాజ్:-శ్రీ పాండురంగ భజన మందిరంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంభద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరంలో ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని సాయంకాలం పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. దేవాలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరంలో జరిగే గ్రహ స్థితులు, పండుగలు, శుభ ముహూర్తాలు, ప్రజల జీవన విధానంపై వాటి ప్రభావం గురించి వివరించారు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రద్ధగా వినడం జరిగింది. అనంతరం దేవాలయ అర్చకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంతో భజన మందిరం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట, డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత” అనే నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామవరం ప్రాంతానికి చెందిన ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ యువతలో చైతన్యం కల్పించారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. రామవరం గణేష్ టెంపుల్ చమన్ వద్ద జరిగిన అవగాహన సదస్సులో 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న పరిస్థితి ఆందోళనకరమని అన్నారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని…
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-తెలనగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఈ నెల **మార్చి 28న (శనివారం)** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో **జాతీయ లోక్ అదాలత్** నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి ఎం రాజేందర్ గురువారం ఒక ప్రకటన లొ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.* రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు * చెక్ బౌన్స్ కేసులు (NI Act cases)* బ్యాంకు రికవరీ కేసులు* మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు (MVOP)* వివాహ బంధానికి సంబంధించిన కేసులు* ఆస్తి పంపకాల వివాదాలు, అద్దె వివాదాలు మరియు ఇతర…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం పండగ సందర్బంగా పట్టణంలో రద్దీ పెరిగిన వేళ కొత్తగూడెం–విజయవాడ హైవే రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న BSNL కార్యాలయం ముందు ఓ లారీ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పండగ కారణంగా రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గాని, గాయాలు గాని సంభవించలేదని డ్రైవర్ తెలిపాడు. పండగ సమయంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
కొత్తగూడెం..ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయములో కోటి కుంకుమార్చన యాగ మహోత్సవం.. పరివర్తన అవాజ్,కొత్తగూడెం మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ (CHIDH.COM)ద్వారా పేర్లు గోత్రములు రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి దత్తాత్రేయ శర్మ..తెలిపారు.కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం (శివాలయం)లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కోటి కుంకుమార్చన మహాయాగ మహోత్సవాన్ని నిర్వహించ సంకల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా మార్చి 19,2026 నుండి మార్చి 28 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్థం సకల ప్రజలకు సౌభాగ్య ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలు కలగాలని సంకల్పంతో పంచాయతన సహితంగా కోటికుంకుమార్చన మహాయాగమును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ,పూజించి, సేవించి జగదాంబ…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం19వ డివిజన్ పరిధిలోని అర్హులైన గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీ సేవలు అందించబడనున్నాయని 19వ డివిజన్ కార్పొరేటర్ స్వప్న శంకర్ నాయక్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యసేవలు పొందలేకపోతున్న గర్భిణీలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సోమవారం చుంచుపల్లి మండలం విద్య నగర్ కాలనీ లో గల న్యూ లైఫ్ హాస్పిటల్‌లో చిట్టి రామవరం తండకు చెందిన భూక్య వెన్నెలకు పూర్తిగా ఉచితంగా సురక్షిత డెలివరీ నిర్వహించామని పేర్కొన్నారు. తల్లి–శిశు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాలు, గిరిజన ప్రాంతాల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. అవసరమైన గర్భిణీలు ముందస్తుగా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం కోసం వైద్య సేవలను మరింత విస్తరించేందుకు కృషి కొనసాగుతుందని, ప్రతి ఇంట్లో ఆరోగ్యకరమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు ఉండాలని ఆకాంక్షిస్తున్నామని స్వప్న శంకర్…
“125 పథకం” ఇందిరమ్మ రాజ్యంలోనే మాయం?” పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం ప్రాంతాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు కుటుంబాలు కరెంటు మీటర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నా, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు చదువులకు ఇబ్బంది పడుతున్నారని, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా విద్యుత్ కనెక్షన్ లేక ఆదాయం కోల్పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీల సమస్యలపై స్పందించని (ఎన్పీడీసీఎల్) అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రకటించిన “125 పథకం” కూడా ఎస్సీలకు అందకుండా, కేవలం కాగితాలపైనే మిగిలిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం, ఎస్సీల మౌలిక అవసరమైన విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోతే అది ఏ రాజ్యం అని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ దివ్యాంగుల సేవ సంస్థ…
పరివర్తన ఆవాజ్ కొత్తగూడెం:-నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర గ్రామంలో 2026 ఫిబ్రవరి 18న జరిగిన మల్లన్న జాతరలో సిలికేశ్వరం గణేష్, తల్లి చంద్రకళ , భార్య మౌనిక, అక్క కీర్తి దైవ దర్శనం కోసం వెళ్లారు. వీరిని కులం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడి చేసి గణేష్ యొక్క 2నెలల పసి బిడ్డను ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు కులం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడిచేసి మానవమృగాల్లా ప్రవర్తించి, 2 నెలల పసిబిడ్డను హత్య చేశారు. ఈ ఘటన కు బాధ్యులైన వ్యక్తులను, కేసు జాప్యం చేస్తున్న పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని cpm భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలని కూడా చూడకుండా, నానా బూతులు తిట్టి అవమానించారు. ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన గణేష్‌ను మూడున్నర గంటల పాటు పైన పేర్కొన్న పెత్తందారులు ఒక గదిలో నిర్భంధించి చితకబాదారు. తన…
పరివర్తన అవాజ్ కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి బైపాస్,మెయిన్ రోడ్ రోడ్డుపై నెంబర్ ప్లేట్లు లేకుండా భారీ వాహనాలు బూడిదను విడుదల చేసుకుంటూ ప్రమాదకర రీతిలో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. లారీలలో సరైన కవర్లు లేకుండా బూడిదను తరలించడం వల్ల గాలిలో బూడిద జల్లుకుంటూ వెనుక వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని లారీలు అతివేగంగా నడుస్తూ, లోడును సరిగా కట్టకుండా తీసుకెళ్లడం వల్ల ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించే వారు భయాందోళనకు గురవుతున్నారు. బూడిద కళ్లలో పడటం, రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో లారీలు రహదారిపై బూడిద చల్లడంతో వెనుక వస్తున్న వాహనాలు స్కిడ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని వాహనదారులు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.