Friday, September 11, 2026
Home Politics మెదక్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిజిల్లా పిఏసీ సమావేశం

మెదక్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిజిల్లా పిఏసీ సమావేశం

0
37

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్, మంత్రి మైనంపల్లి రోహిత్‌రావు

మెదక్, ఆగస్టు 24: మెదక్ జిల్లా పట్టణ

కేంద్రంలోని శ్రీ వినాయక ఫంక్షన్ హాల్‌లో మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మల్కాజ్‌గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యకలాపాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువ కావడం వంటి అంశాలపై నాయకులు, పార్టీ శ్రేణులతో చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు దృష్టి సారించారు.సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ, గాలి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, మెదక్ పట్టణ మున్సిపల్ చైర్మన్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, రామాయంపేట కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పీఏసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర పోషించాలనే దిశగా నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.