Thursday, October 22, 2026
Home Politics బతుకమ్మ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … —మడికొండ రంగలీలా మైదానంలోని బతుకమ్మ స్థల...

బతుకమ్మ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … —మడికొండ రంగలీలా మైదానంలోని బతుకమ్మ స్థల అభివృద్ధి పనులకు శంకుస్థాపన….

0
27

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన  అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 05

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్‌లో రంగలీలా మైదానంలోని బతుకమ్మ స్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పరిశీలించారు. స్థానిక ప్రజల అవసరాలు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బతుకమ్మ స్థలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు సౌకర్యవంతంగా నిర్వహించుకునేలా స్థలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. స్థలంలో అవసరమైన మౌలిక వసతులు, పరిసరాల అభివృద్ధి, పారిశుద్ధ్య చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే  తెలిపారు.ఈ కార్యక్రమంలో 64 డివిజన్ అధ్యక్షులు దువ్వ శ్రీకాంత్,45 డివిజన్ అధ్యక్షులు కర్ర హరీష్, 44 డివిజన్ అధ్యక్షులు సదానందం,46 డివిజన్ అధ్యక్షులు వాస్కుల శ్రీను, కాజీపేట దర్గా పిఎసిఎస్ చైర్మన్ గంగుల శ్రీనివాసరెడ్డి,64 డివిజన్ మాజీ అధ్యక్షులు కుర్ల మోహన్, మహిళ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, మహిళా అధ్యక్షురాలు రజినీ, కాంటెస్టెంట్ కార్పొరేటర్లు లింగమూర్తి, వాస్కుల శంకర్, సీనియర్ నాయకులు బిల్లా రవి, వాస్కుల శివ, నాగరాజు, అర్జున్, పరమేష్, వస్కుల నాగరాజు, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.