Thursday, October 22, 2026
Home People TS NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ని కలిసి మారథాన్ కు ఆహ్వానించిన విష్ణు...

TS NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ని కలిసి మారథాన్ కు ఆహ్వానించిన విష్ణు రెడ్డి….

0
54

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5

ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించనున్న *” మారథాన్ ఎడిషన్-2 కు హాజరు కావాలని నిర్వాహకులు, యువ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి  సోమవారం TG-NPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  కర్ణాటి వరుణ్ రెడ్డి, IAS   ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా విష్ణు రెడ్డి  మాట్లాడుతూ.. మారథాన్ కేవలం పరుగు పందెం మాత్రమే కాదు, సమాజంలో ఫిట్‌నెస్, ఐక్యత, యువతలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఒక ఉద్యమం అని తెలిపారు. వరంగల్-హనంకొండ-కాజీపేట్ యువతను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు ఈ మారథాన్ నిర్వహిస్తున్నామని చెప్పారు.ఆహ్వానాన్ని స్వీకరించిన CMD వరుణ్ రెడ్డి  మారథాన్ నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంచుతాయని, తాను తప్పకుండా హాజరవుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో మారథాన్ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.