బతుకమ్మ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … —మడికొండ రంగలీలా మైదానంలోని బతుకమ్మ స్థల అభివృద్ధి పనులకు శంకుస్థాపన….
హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 05 వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్లో రంగలీలా మైదానంలోని బతుకమ్మ స్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు. స్థానిక ప్రజల అవసరాలు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బతుకమ్మ స్థలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు సౌకర్యవంతంగా నిర్వహించుకునేలా స్థలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ...