Thursday, October 22, 2026
Home Politics 41వ డివిజన్‌లో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలు

41వ డివిజన్‌లో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలు

0
29

📰 Generate e-Paper Clip

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గ్రేటర్ వరంగల్ పరిధిలోని 41వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 41వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ నన్నపునేని నరేందర్  గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పలువురు యువకులు, నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.