Thursday, October 22, 2026
Home Politics హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన INTUC యూనియన్ నేతలు….

హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన INTUC యూనియన్ నేతలు….

0
44

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ఐఎన్‌టీయూసీ – తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (TWU) కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 10 రీజన్ల (డిపోల)కు గాను ఏకంగా 6 రీజన్లలో ఘనవిజయం సాధించి ఐఎన్‌టీయూసీ కూటమి తన సత్తా చాటింది.ఈ చారిత్రాత్మక విజయానంతరం, ఐఎన్‌టీయూసీ ఆర్టీసీ యూనియన్ ముఖ్య నాయకులు జితేందర్ రెడ్డి, పాష, రమేష్, వేణు మాధవ్, వేణు గోపాల్, మోహన్ మరియు ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కూర వెంకట్, డిసిసి మీడియా & కమ్యూనికేషన్ కమిటీ ఛైర్మన్ మార్క విజయ్ కుమార్  మరియు ప్రతినిధులు ఈరోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల విజయ కేతనం ఎగురవేసిన సందర్భంగా డీసీసీ అధ్యక్షునికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గెలుపొందిన కార్మిక నేతలకు, ఆర్టీసీ కార్మికులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  మాట్లాడుతూ… పదేళ్ల తర్వాత వచ్చిన ఈ ఎన్నికల అవకాశంలో ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ అనుబంధ కూటమికి బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 స్థానాలకు గాను 6 స్థానాలను గెలుచుకోవడం కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రజా ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తూ, కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి మరియు వారి సంక్షేమానికి ఈ నూతన నాయకత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.–ఎన్నికల నేపథ్యం – ప్రాధాన్యత: రాష్ట్రంలో దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 9న బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఎన్నడూ లేని విధంగా 98 శాతం భారీ పోలింగ్‌తో పాల్గొని తమ హక్కును ఉపయోగించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రీజనల్/స్థానిక గుర్తింపు కోసం జరిగిన ఈ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (TWU) – INTUC కూటమి ప్రచారంలో దూసుకుపోయి కార్మికుల నమ్మకాన్ని గెలుచుకుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.