Thursday, October 22, 2026
Home Politics -డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహానికి  వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు  నివాళి.

-డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహానికి  వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు  నివాళి.

0
23

📰 Generate e-Paper Clip

.పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు, తనతో పాటు టెన్నిస్ ఆడే మిత్రుడు డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి తీవ్రంగా బాధ కలిగించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహాన్ని గురువారం వారి నివాసానికి వెళ్లి సందర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. డాక్టర్ కుందూరు వెంకటరెడ్డితో తనకు సుబేదారి ఆఫీసర్స్ క్లబ్‌లో పరిచయం ఉండటంతో పాటు, ఆయనతో కలిసి టెన్నిస్ ఆడే స్నేహం కూడా ఉందన్నారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని, ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.