Thursday, October 22, 2026
Home Politics -నియోజకవర్గంలో -వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం….. —స్టేషన్ ఘనపూర్‌కు 8 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు….*...

-నియోజకవర్గంలో -వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం….. —స్టేషన్ ఘనపూర్‌కు 8 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు….* *​ఇప్పటికే 4 పూర్తి.. నిర్మాణ దశలో ఉన్న మరో 4 త్వరలోనే ప్రారంభం…

0
32

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 2.45 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ ప్రారంబొత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సబ్ స్టేషన్ ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. సబ్ స్టేషన్ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన విద్యుత్ సరఫరాను లాంఛనంగా పునఃప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతులను పటిష్టం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ​స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యలను శాశ్వతంగా అధిగమించడానికి 8 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లను మంజూరు చేయించినట్లు వెల్లడించారు. వీటిలో ఫతేషాపూర్‌తో కలిపి 4 సబ్ స్టేషన్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. మిగిలిన 4 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు కూడా చివరి దశలో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా పూర్తి చేసి అతి త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.సబ్ స్టేషన్ల నిర్మాణంతో పంట పొలాలకు సాగునీరు అందించే మోటార్లు కాలిపోకుండా వోల్టేజ్ సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందుతుందని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపడమే తన ధ్యేయమని, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్థానిక సర్పంచ్ సుజాత, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, రఘునాథపల్లి మండల ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాలు ప్రజలు, రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.