Thursday, October 22, 2026
Home Politics ఆధునిక ఫ్రూట్‌ మార్కెట్‌కు జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన…

ఆధునిక ఫ్రూట్‌ మార్కెట్‌కు జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన…

0
40

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  వరంగల్‌: సెప్టెంబర్ 27 

రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్‌ మార్కెట్‌ ఏర్పాటుకు ఆదివారం స్థల పరిశీలన చేశారు.గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి,జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పులి ప్రియాంక సంబంధిత అధికారులు పరిశీలించారు.రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం,పండ్ల ఉత్పత్తుల విక్రయానికి అనువైన మౌలిక వసతుల ఏర్పాటు చేయడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్కెట్ ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా స్థల పరిశీలన చేశారు.ప్రతిపాదిత స్థలంలోని విస్తీర్ణం, రహదారి, రవాణా, మౌలిక వసతుల లభ్యత తదితర అంశాలనుభవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, వరంగల్ ఆర్డీవో సుమ,జిల్లా ల్యాండ్ సర్వే మరియు రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు,మార్కెటింగ్ డైరెక్టర్ రుద్రప్రసాద్‌, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.