Thursday, October 22, 2026
Home People ఉల్లాస్‌తో మహిళల్లో అక్షర జ్ఞానానికి కొత్త వెలుగు… -47 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3,700 మంది...

ఉల్లాస్‌తో మహిళల్లో అక్షర జ్ఞానానికి కొత్త వెలుగు… -47 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3,700 మంది మహిళలకు పరీక్షలు… -కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, ఉప కమిషనర్ సమ్మయ్య….

0
46

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  సెప్టెంబర్ 27.

గ్రేటర్ వరంగల్ నగరంలో మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించి, వారిని సంపూర్ణ అక్షరజ్ఞానులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉల్లాస్–(నవభారత్ సాక్షరత) కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3,700 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా వరంగల్ అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, GWMC ఉప కమిషనర్ సమ్మయ్యతో కలిసి కొత్తవాడ ప్రభుత్వ పాఠశాల, గిర్మాజీపేట ప్రభుత్వ పాఠశాల, వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాల తదితర పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలకు హాజరైన మహిళలతో మాట్లాడి, కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, హాజరు, పరీక్ష నిర్వహణ విధానం తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్ మాట్లాడుతూ, అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం మాత్రమే కాకుండా, మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు దోహదపడుతుందని తెలిపారు.మహిళలు అక్షరజ్ఞానం సాధించడం ద్వారా తమ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలోనూ మరింత చురుకైన పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ఉల్లాస్–నవభారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా నిరక్షరాస్య మహిళలకు అక్షరజ్ఞానం అందించి, వారిని స్వావలంబన దిశగా నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మరియు మార్చి మాసాల్లో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 15 సంవత్సరాల పైబడిన మహిళలకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల్లో మహిళలు ఉత్సాహంగా పరీక్షలకు హాజరై తమ అభ్యసన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమం ద్వారా అక్షరాస్యతతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉల్లాస్ ఇన్చార్జి అధికారి నాగేశ్వర్ రావు, డీఎంసీలు రేణుక, రజిత టీఎంసీ రమేష్ ఆర్పీలు, సి ఓ లు తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.