ఉల్లాస్‌తో మహిళల్లో అక్షర జ్ఞానానికి కొత్త వెలుగు… -47 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3,700 మంది మహిళలకు పరీక్షలు… -కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, ఉప కమిషనర్ సమ్మయ్య….

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  సెప్టెంబర్ 27. గ్రేటర్ వరంగల్ నగరంలో మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించి, వారిని సంపూర్ణ అక్షరజ్ఞానులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉల్లాస్–(నవభారత్ సాక్షరత) కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3,700 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా వరంగల్ అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, GWMC ఉప కమిషనర్ సమ్మయ్యతో కలిసి కొత్తవాడ ప్రభుత్వ పాఠశాల, గిర్మాజీపేట ప్రభుత్వ పాఠశాల, వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాల తదితర...