Friday, September 11, 2026
Home Uncategorized నీట్‌లో 434 మార్కులు.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చాణక్య!

నీట్‌లో 434 మార్కులు.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చాణక్య!

0
16

📰 Generate e-Paper Clip

Oplus_16908288

అవాజ్ న్యూస్ ఆళ్లపల్లి, సెప్టెంబర్ 4:

మారుమూల ప్రాంతం.. పరిమిత వసతులు.. అయినా లక్ష్యసాధనలో వెనుకడుగు వేయలేదు. పశుసాయంపై ఆధారపడి జీవించే గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన పాయం చాణక్య పట్టుదలతో చదివి వైద్య విద్యలో అడుగుపెట్టాడు.2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నీట్ పరీక్షలో 434 మార్కులు సాధించి 19,680 ర్యాంకు పొందాడు. ఎస్టీ కేటగిరీలో కౌన్సెలింగ్ ద్వారా హైదరాబాద్‌లోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నాడు.కష్టాలను అధిగమించి..చాణక్య స్వగ్రామం గుండాల మండలంలోని మారుమూల ప్రాంతం. చిన్ననాటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ చదువుపై ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. తల్లిదండ్రులు వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి కుటుంబాన్ని నడిపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ చాణక్య తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివాడు.నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వైద్య విద్యలోకి అడుగుపెట్టిన చాణక్య, తమ ప్రాంత యువతకు ఆదర్శంగా నిలిచాడని పలువురు అభినందించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్‌లో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చాణక్య తెలిపాడు.“పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యం పట్ల పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు” అనే విషయాన్ని చాణక్య తన విజయంతో నిరూపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.