పరివర్తన ఆవాజ్ :జెడ్డాలో ఘనంగా GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెడ్డా, సౌదీ అరేబియా, సెప్టెంబర్ 4: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత మరియు అవగాహన కోసం పనిచేస్తున్న GWAC – Gulf Workers Awareness Center 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెడ్డా, సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో GWAC ప్రతినిధులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, భద్రత, సంక్షేమం, విద్య మరియు భవిష్యత్ అవకాశాలపై సమావేశంలో చర్చించారు. “అవగాహన • ఐక్యత • అభివృద్ధి” అనే లక్ష్యంతో GWAC గత పది సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికుల్లో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయడం, అవసరమైన సమయంలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా మరింత బలమైన కార్మిక సమాజాన్ని నిర్మించాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ కేక్‌ను కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.“మన అధికారం కోసం.. మన భవిష్యత్తు కోసం.. మన ఐక్యతే మన బలం” అనే సందేశంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది




