Saturday, September 12, 2026
Home Politics ద్విముఖ పోటీలో సిపిఐదే ఘన విజయం

ద్విముఖ పోటీలో సిపిఐదే ఘన విజయం

0
43
IMG-20260204-WA0445

📰 Generate e-Paper Clip

ఎర్ర జెండాతోనే సమస్యలకు పరిస్కారం

సిపిఐ అభ్యర్థులకు ఘనవిజయాన్ని అందించండి

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో పునరావృతం

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం కార్పొరేషన్ జరుగుతున్న ద్విముఖ పోటీల్లో సిపిఐదే ఘనవిజయమని, ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా కొత్తగూడెం కార్పొరేషన్’ను సిపిఐకి అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ సిపిఐ అభ్యర్థి సహేరా మహమ్మద్, 12వ డివిజన్ అభ్యర్థి పడాల ఆకాంక్ష, 12వ డివిజన్ అభ్యర్థి మంద నాగలక్ష్మి లను గెలిపించాలని కోరుతూ బుధవారం డివిజన్ల పరిధిలో ఇంటింటి ప్రచారం, బస్తి సమావేశాలు జరిగాయి. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ న్యాయమైన డివిజన్ల సంఖ్యతో కలిసి పోటీకి సిపిఐ సిద్దపడినప్పటికి పొత్తుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం సరైంది కాదన్నారు. ప్రజాసమస్యలపై స్పందించేది, వాటి పరిస్కారంకోసం కృషిచేసేది సిపిఐనేనాని, ఎర్ర జెండాను ఇక్కడి ప్రజలు అనాదిగా ఆదరిస్తున్నారన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పోరాటాలు చేసే ఎర్రజెండా అభ్యర్థులను కౌన్సిల్‌కు పంపాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే సిపిఐని ఆదరించాలని కోరారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కూనంనేని చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంద్వారా గెలుపును సులభతరం చేసుకోవాలని సిపిఐ అభ్యర్థులకు, నాయకులకు సూచించారు. ప్రచార కార్యక్రమంలో సిపిఐ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎండి యూసుఫ్, కిలారు ప్రసాద్, పడాల భవాని, నర్సింహా, మల్లేష్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.