Saturday, September 12, 2026
Home Politics 23వ వార్డు డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి (స్వతంత్ర)గూగులోత్ విజయలక్ష్మి ఎన్నికల బరిలో

23వ వార్డు డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి (స్వతంత్ర)గూగులోత్ విజయలక్ష్మి ఎన్నికల బరిలో

0
47
IMG_20260204_142031

📰 Generate e-Paper Clip

ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలీ అని ఓటర్లకు విజ్ఞప్తి

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-23వ వార్డు డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూగులోత్ విజయలక్ష్మి, ఉంగరం గుర్తు (ఐదో నెంబర్) పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను నమ్ముకున్న గ్రామాల ఓటర్ లు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తానని, అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ప్రజల నమ్మకమే తన బలం అని, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి, ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గూగులోత్ విజయలక్ష్మి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.