Monday, September 14, 2026
Home Politics మైనార్టీ గురుకులాల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభం.

మైనార్టీ గురుకులాల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభం.

0
47
3c29315a7fdc4f0aad50f94e969571371-1

📰 Generate e-Paper Clip

  1. పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకులాల అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ IDOC క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు తమ పిల్లలను మైనార్టీ గురుకుల పాఠశాల ఐదవ తరగతి మరియు కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించాలని కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలికలకు, బాలురకు, బూర్గంపాడు బాలికలకు, భద్రాచలం బాలురకు, అశ్వారావుపేట బాలికలకు, ఇల్లందు బాలికలకు విడివిడిగా ఐదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ముస్లిం మైనారిటీ పిల్లలను తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైనారిటీల విద్యావకాశాల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అడ్మిషన్లు ఆన్‌లైన్ ప్రారంభం కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అభివృద్ధి అధికారి కే. సంజీవరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్.ఎల్.సి ఎం.జే. అరుణ కుమారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా విజిలెన్స్ అధికారులు కే. సీతారాములు, ఎం.ఏ. రవూఫ్, జిల్లాలోని మైనారిటీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మైనారిటీ గురుకులాల నాణ్యమైన ఉచిత విద్యావకాశాలపై అవగాహన కల్పించుటకు సీతారాములు అడ్మిషన్ల ప్రచార సాధనంగా రచించిన ఆడియో, వీడియో పాటలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే. సంజీవరావు కార్యాలయంలో ప్రారంభించారు.
గమనిక:
తమ పిల్లలను చేర్పించడానికి పూర్తి వివరాల కోసం సంబంధిత పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.