మైనార్టీ గురుకులాల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభం.
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకులాల అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ IDOC క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు తమ పిల్లలను మైనార్టీ గురుకుల పాఠశాల ఐదవ తరగతి మరియు కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలికలకు,...