Monday, September 14, 2026
Home Politics సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాల కాంట్రాక్ట్...

సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాల కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- AITUC పిలుపు

0
55
IMG-20260116-WA0222

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం,కార్మికుల హక్కుల కోసం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు పిలుపునిచ్చారు.శుక్రవారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని బిల్డింగ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, మెయిన్ వర్క్ షాప్, నర్స క్వార్టర్స్ తదితర పని ప్రదేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా అనేక హక్కులను సాధించుకోవడం జరిగిందని,ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించు వేస్తుందని విమర్శించారు.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు పరచి పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడులను తీసుకువచ్చి పని గంటలు పెంచడం,హక్కులను హరించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భవిష్యత్తు పోరాటాలకి ఈ సభలు దోహద పడతాయని అన్నారు.ఈ నేపథ్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం చంద్రశేఖర్,ch శ్రీను, సుభద్ర, వినోద, అనసూర్య, లక్ష్మి, వెంకన్న, శంకర్, రమణ, అప్పారావు, లక్ష్మి, సుశాంత్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.