Saturday, September 12, 2026
Home Politics చిట్టి రామారం 19వ డివిజన్ నుంచి భానోత్ రాంబాబు నామినేషన్ దాఖలు

చిట్టి రామారం 19వ డివిజన్ నుంచి భానోత్ రాంబాబు నామినేషన్ దాఖలు

0
47
IMG_20260130_181557

📰 Generate e-Paper Clip

 

పరివర్తన అవాజ్, కొత్తగూడెం

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిట్టి రామారం 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా భానోత్ రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల బరిలోకి దిగారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు గోబ్రియ నాయక్ రాజకీయ వారసుడిగా భానోత్ రాంబాబు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. గతంలో ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.

ఈ సందర్భంగా భానోత్ రాంబాబు మాట్లాడుతూ, చిట్టి రామారాన్ని అవినీతి రహితంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

స్థానిక ప్రజలు మాట్లాడుతూ, భానోత్ రాంబాబు నిజాయితీపరుడు, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడని పేర్కొన్నారు. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లందరూ ఒకే స్వరంతో మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.