Saturday, September 12, 2026
Home Politics ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో

0
52

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో

                                     మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్

 బీబీపేట పరివర్తన ఆవాజ్ జనవరి 30,   బీబీపేట మండల కేంద్రంలో మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ అసిఫ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆసిఫ్ గారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి రోడ్డుపై ఫ్యామిలీతో నిరసన తెలుపుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారితో బూతు మాటలు తిడుతూ ముస్లిం పోలీస్ అధికారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం సరైన పద్ధతి కాదని . మతం పేరుతో తుర్కోడు అని నోటికి వచ్చిన విధంగా ఒక వర్గం ప్రజలను కించపరుస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డి నీ పద్ధతులు మార్చుకొని గతంలో నీ బ్రతుకు ఒకసారి ఆలోచించుకో ప్రాణ బిక్ష పెట్టుమని నువ్వు నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం ఓటు అడుక్కున్నారు ముస్లిం సోదరుల కాళ్ళు మొక్కి ఆరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు మదమెక్కి ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావ్ తస్మాత్ జాగ్రత్త నీ అహంకారపూరితమైన మాటలను ముస్లిం సమాజం మరియు ప్రజలు ఉపేక్షించరు కచ్చితంగా వచ్చే ఎలక్షన్లో నీకు ఓటుతో బుద్ధి చెప్తారని మాజీ కోఆప్షన్ సభ్యులు ఆసిఫ్ అన్నారు మీరు అన్న మాటలకు క్షణమే క్షమాపణ చెప్పాలి లేకుంటే నీపై చట్టపరంగా పోరాడుతామని తెలియజేయడం జరిగింది వారు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.