Thursday, October 22, 2026
Home Politics –హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యేలు నాయిని,నాగరాజు…

–హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యేలు నాయిని,నాగరాజు…

0
35

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58 వ డివిజన్ రోజ్ గార్డెన్ లో వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు మెడికర్ హాస్పిటల్ వారిచే ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ మెగా హెల్త్ క్యాంపు ని శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి ,వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు కేఆర్ నాగరాజు,డీసీసీ అధ్యక్షులు  ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.157 వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ జయంతిని కేవలం జయంతి కార్యక్రమంగా కాకుండా ప్రజలకు సేవ చేసే రోజుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గాంధీజీ చూపిన శాంతి, అహింస, సేవా మార్గాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మహాత్మా గాంధీతో పాటు ఆయన కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు అవసరమైన సమయంలో తమ వంతు సహాయం అందించడమే నిజమైన ప్రజాసేవ అని ఎమ్మెల్యే నాయిని అన్నారు. వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సుధాకర్,మాజీ కార్పొరేటర్ నాగరాజు,నాయకులు రవీందర్,మేరీ,దామోదర్, వైద్య సంస్థల డైరెక్టర్లు, వైద్యులు, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.