Thursday, October 22, 2026
Home People ఉద్యమమే ఊపిరిగా..సమాజ హితమే ఆశయంగాతెలంగాణ ఉద్యమకారుడు,సామాజిక శ్రేయోభిలాషి,సృజనాత్మక దర్శకుడు డా.మొహమ్మద్ నజీరుద్దీన్ మహమూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు…

ఉద్యమమే ఊపిరిగా..సమాజ హితమే ఆశయంగాతెలంగాణ ఉద్యమకారుడు,సామాజిక శ్రేయోభిలాషి,సృజనాత్మక దర్శకుడు డా.మొహమ్మద్ నజీరుద్దీన్ మహమూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు…

0
32

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

హనుమకొండ: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి,ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ..సామాజిక చైతన్యాన్ని తన కళా సృజనలో ప్రతిబింబిస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక శ్రేయోభిలాషి, సృజనాత్మక దర్శకుడు **డా. మొహమ్మద్ నజీరుద్దీన్ మహమూద్ (అదీబ్ నజీర్)**కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిష్ఠాత్మకమైన భీమా సంస్థలో జిల్లా అధికారిగా పనిచేస్తున్న సమయంలోనే మాతృభూమి పిలుపునకు స్పందించి..ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి తెలంగాణ సాధన ఉద్యమంలో అడుగుపెట్టిన ఆయన త్యాగం స్ఫూర్తిదాయకం.ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమై,తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.వెండితెరపై సామాజిక బాధ్యత ఉద్యమం ముగిసిన తర్వాత కూడా సామాజిక బాధ్యత నుంచి ఆయన వెనక్కి తగ్గలేదు. సమాజంలోని రుగ్మతలను ప్రశ్నిస్తూ.. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సినిమాను ఒక సామాజిక మాధ్యమంగా మలుచుకున్నారు.‘ఇది కల కాదు’ చిత్రంలో మహిళల భద్రత, రైతుల సమస్యలు, సరిహద్దుల్లో దేశ రక్షణకు కృషి చేస్తున్న సైనికుల సంక్షేమం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలు, ప్రభుత్వాల బాధ్యతను గుర్తుచేశారు.అదే సామాజిక దృక్పథానికి కొనసాగింపుగా ప్రస్తుతం ‘జులుం’ చిత్రాన్ని రూపొందిస్తూ..సామాన్యులకు అవసరమైన మార్గనిర్దేశంతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి విలువైన సూచనలు అందిస్తున్నారు.ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగస్వామి కావడం తనకు గర్వకారణమని ఆయన మిత్రులు పేర్కొంటున్నారు.ప్రశ్నించడమే కాదు..పరిష్కారాన్ని చూపే వ్యక్తిత్వం సమస్యలను ప్రశ్నించడమే కాకుండా..వాటికి పరిష్కార మార్గాలను సూచించే ఆలోచనా విధానం డా.నజీరుద్దీన్ మహమూద్ ప్రత్యేకత. ప్రజా సమస్యలపై అవగాహన, సామాజిక స్పృహ,నాయకత్వ లక్షణాలతో ప్రజల పక్షాన నిలుస్తున్న ఆయనలాంటి నిస్వార్థ వ్యక్తులు ప్రజా జీవితంలో మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.“మీ ఆశయం ప్రజల పక్షం.. మీ ఆలోచన సమాజ హితం.. మీ అడుగు సత్య పథం” అంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.డా.మొహమ్మద్ నజీరుద్దీన్ మహమూద్‌కు ఆయురారోగ్యాలు, సంపూర్ణ సంతోషం కలగాలని.. ఆయన సామాజిక సేవా సంకల్పం చిరస్థాయిగా నిలవాలని.. మరెన్నో అద్భుతమైన కళా సృష్టులతో ప్రజలను చైతన్యపరచాలని.. ప్రజా నాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.