Thursday, October 22, 2026
Home Politics -సిరిసిల్ల మీద గురిపెడదాం… ఈ గడీని నేలమట్టం చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి… -సిరిసిల్ల బహిరంగ...

-సిరిసిల్ల మీద గురిపెడదాం… ఈ గడీని నేలమట్టం చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి… -సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు  …

0
28

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 

పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లుగా… కేటీఆర్ కు ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ గురించి అని సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి  ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి ఫామ్ హౌస్ లో పడుకున్న కేటీఆర్ తండ్రి కెసిఆర్ నీ అడగమని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గడ్డమీద గురిపెడదామని సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు. ధైర్యం దైవం కలగలిసిన ప్రాంతం సిరిసిల్ల అని అన్నారు. ఈ బహిరంగ సభలో మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  ని మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి  తో కలిసి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే  తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు, మల్లారెడ్డిపల్లె పిఎసిఎస్ చైర్మన్ కుమార్,హన్మకొండ జిల్లా జెబిఎల్ చైర్మన్ రుగ్విద్ రెడ్డి, అడ్వకేట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.