Thursday, October 22, 2026
Home Politics -మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ సోదరుడు సురేందర్ మృతికి హనుమకొండ డీసీసీ...

-మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ సోదరుడు సురేందర్ మృతికి హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్ర సంతాపం…

0
8

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

నడికుడ: హనుమకొండ జిల్లా నడికుడ మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్  అన్నగారైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర సురేందర్ గారు అకాల మరణం చెందడం పట్ల హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదివారం మృతుడి నివాసానికి చేరుకుని, బుర్ర సురేందర్  భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని తోడై నిలిచారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ… బుర్ర సురేందర్ గౌడ్  ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మళ్ళా రెడ్డి, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతునికి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.