Friday, October 23, 2026
Home People సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

0
64

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుని,బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా కాలుకదుపుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని చైర్ పర్సన్ పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, సంతోషాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.