సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుని,బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా కాలుకదుపుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని చైర్ పర్సన్ పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను,...