-మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ సోదరుడు సురేందర్ మృతికి హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్ర సంతాపం…

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 నడికుడ: హనుమకొండ జిల్లా నడికుడ మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్  అన్నగారైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర సురేందర్ గారు అకాల మరణం చెందడం పట్ల హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదివారం మృతుడి నివాసానికి చేరుకుని, బుర్ర సురేందర్  భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....