Thursday, October 22, 2026
Home Politics –నాయకత్వ లక్షణాలపై అవగాహన అవసరం.. –రాజకీయాల్లోకి వచ్చే వారికి శిక్షణ అందించడమే లక్ష్యం… –ప్రముఖ పొలిటికల్...

–నాయకత్వ లక్షణాలపై అవగాహన అవసరం.. –రాజకీయాల్లోకి వచ్చే వారికి శిక్షణ అందించడమే లక్ష్యం… –ప్రముఖ పొలిటికల్ స్టార్టజిస్ట్ ఎర్రబెల్లి రజనీకాంత్—

0
21

📰 Generate e-Paper Clip

 

సెప్టెంబర్ 30 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక /హనుమకొండ: రాజకీయాల్లోకి వచ్చి సరైన అవగాహన లేకుండా విపరీతంగా డబ్బు ఖర్చు చేసి నష్టపోతున్న వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర రాజనీతి’ కార్యక్రమం ద్వారా వర్క్‌షాప్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం హనుమకొండ లోని కాళోజి కళాక్షేత్రంలో రాజకీయాల్లోకి వచ్చే అభ్యర్థులకు ఒక్కరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 2,500 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో సుమారు వెయ్యి మంది వర్క్‌షాప్‌కు హాజరైనట్లు వెల్లడించారు. గొప్ప నాయకుడిగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, ప్రజల్లో ఆదరణ, గుర్తింపు పొందేందుకు అనుసరించాల్సిన విధానాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇవ్వడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాజకీయ పార్టీలు, యూనివర్సిటీలు, కుటుంబాలు ప్రత్యేకంగా నాయకత్వ శిక్షణ అందించకపోవడంతో స్వయంగా ఎదిగిన వారినే పార్టీలు, ప్రజలు నాయకులుగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఆర్గనైజేషన్ తరఫునే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వర్క్‌షాప్‌లో నేర్చుకున్న అంశాలను వ్యక్తిగత జీవితంలో, ప్రజాజీవితంలో ఆచరణలో పెట్టినట్లయితే నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. గత పదేళ్లుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు వేలాది మంది స్థానిక రాజకీయ నాయకులతో పనిచేసిన అనుభవంతో ఈ శిక్షణ కార్యక్రమాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు భవిష్యత్‌లో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి నాయకత్వ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.