–నాయకత్వ లక్షణాలపై అవగాహన అవసరం.. –రాజకీయాల్లోకి వచ్చే వారికి శిక్షణ అందించడమే లక్ష్యం… –ప్రముఖ పొలిటికల్ స్టార్టజిస్ట్ ఎర్రబెల్లి రజనీకాంత్—
సెప్టెంబర్ 30 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక /హనుమకొండ: రాజకీయాల్లోకి వచ్చి సరైన అవగాహన లేకుండా విపరీతంగా డబ్బు ఖర్చు చేసి నష్టపోతున్న వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర రాజనీతి’ కార్యక్రమం ద్వారా వర్క్‌షాప్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం హనుమకొండ లోని కాళోజి కళాక్షేత్రంలో రాజకీయాల్లోకి వచ్చే అభ్యర్థులకు ఒక్కరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 2,500 మంది దరఖాస్తు...