Thursday, October 22, 2026
Home Politics -చనిపోయిన మాజీ సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే...

-చనిపోయిన మాజీ సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ…

0
28

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పోతురాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంద బాబురావు  అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ  వెళ్లి వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ  మనోధైర్యాన్ని కల్పించారు.ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండా సురేఖ  వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.100000/ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసారు. వారి కుటుంబానికి కొండా దంపతుల సహకారం ఎల్లవేళలా వుంటుందని భరోసానిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.