పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పోతురాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంద బాబురావు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వెళ్లి వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మనోధైర్యాన్ని కల్పించారు.ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండా సురేఖ వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.100000/ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసారు. వారి కుటుంబానికి కొండా దంపతుల సహకారం ఎల్లవేళలా వుంటుందని భరోసానిచ్చారు.