పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరకాల ఆర్టీసీ డిపోలో ప్రచారం నిర్వహించారు. అనంతరం హనుమకొండ ఆర్టీసీ డిపో-1 లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సభలో ఆయన ఆర్టీసీ కార్మిక నేతలతో కలిసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. హనుమకొండ ఆర్టీసీ డిపో-1 పరిధిలోని క్లాస్-6, క్లాస్-3 విభాగాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాణం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల సభ మరియు ప్రచార కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు కార్మికులు పాల్గొన్నారు.




