Thursday, October 22, 2026
Home People -వరంగల్ జర్నలిజంపై జులుం నడవదు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఖబర్దార్ – తూర్పు పరపతి సంఘం అధ్యక్షుడు...

-వరంగల్ జర్నలిజంపై జులుం నడవదు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఖబర్దార్ – తూర్పు పరపతి సంఘం అధ్యక్షుడు నరేందర్….

0
14

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తీరుపై వరంగల్ జర్నలిస్టులు భగ్గుమన్నారు. మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో భారీ ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ.. ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి నాలుగు సార్లు జరిగాయని, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి తప్ప, ఇలా దిష్టిబొమ్మలు తగలబెట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు తమ నిరసనలు ఆపబోమని ఆందోళనకారులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు జర్నలిస్టులు కొరుకుప్పల నరేందర్, పెరుమాండ్ల మధుసూదన్, బండి రవి, మిట్టపల్లి నవనీత్, మహమ్మద్ అమీర్, నీలం శివ, గంగరాజు, వంశీ ,వెలుగందుల అజయ్ గురూజీ, రాజు, భాగ్యరాజు, ప్రకాష్ ,ప్రశాంత్, కృష్ణ, నరేష్, బేతి ఉమా శంకర్, చిన్నబాబు, కలికోట శ్రీధర్, యుగేందర్, జన్ను శ్యామ్, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.