-వరంగల్ జర్నలిజంపై జులుం నడవదు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఖబర్దార్ – తూర్పు పరపతి సంఘం అధ్యక్షుడు నరేందర్….
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తీరుపై వరంగల్ జర్నలిస్టులు భగ్గుమన్నారు. మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో భారీ ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ.. ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి నాలుగు సార్లు జరిగాయని, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే...