పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 వరంగల్: ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బుధవారం వరంగల్లో భారీ అఖిలపక్ష పాదయాత్ర నిర్వహించారు.వరంగల్ పోచమ్మైదాన్ సెంటర్ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ పాదయాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, కుడా చైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం నినాదాలు చేస్తూ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.పాదయాత్ర అనంతరం కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ…ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటు ప్రజల హక్కుకు ప్రతీక అని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, ఓటు హక్కును కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అయూబ్ స్పష్టం చేశారు.అలాగే కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.పాదయాత్రలో నాయకులు “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి – ఓటు హక్కును పరిరక్షించాలి”, “ఓటు చోరీని అరికట్టాలి”, “సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి” అంటూ నినాదాలు చేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ…ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని పేర్కొన్నారు.ఓటు చోరీ, ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తలెత్తిన అనుమానాలు, ఆరోపణలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు కలిసి ప్రజల హక్కుల కోసం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తారని తెలిపారు. ఓటు హక్కును కాపాడటం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బస్మియా, SUCI (C) అడ్డుల సత్యనారాయణ, అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు నవీద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, ఎస్టీ సెల్ చైర్మన్ రవీందర్ నాయక్, బీసీ సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కరుణాటి పార్వతమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు అబ్బిడి రాజిరెడ్డి, పిన్నింటి అనిల్ రావు, అత్తి కుమారస్వామి, మండల అధ్యక్షులు ఇస్లావత్ సావిత్రి, పోశాల వెంకన్న, దాడి శివ, రవికుమార్, టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణకర్, సయ్యద్ ఇంతియాజ్, అశోక్, మొహమ్మద్ జానీ, పసునూరి శ్రావణ్ తదితరులతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్, గ్రామస్థాయి నాయకులు, చైర్మన్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….




