–జనసంద్రంగా మారిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర…– –ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అఖిలపక్ష భారీ పాదయాత్ర…. —ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ ..–
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 వరంగల్: ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బుధవారం వరంగల్‌లో భారీ అఖిలపక్ష పాదయాత్ర నిర్వహించారు.వరంగల్ పోచమ్మైదాన్ సెంటర్ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ పాదయాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ...