Thursday, October 22, 2026
Home Sports క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం… —ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరం—- —-బ్యాట్ పట్టి క్రికెట్...

క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం… —ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరం—- —-బ్యాట్ పట్టి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

0
20

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7

వర్ధన్నపేట,  (): యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డి.సి. తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.తొలి మ్యాచ్‌లో కేశవపురం, ఎన్‌ఎస్‌ తండా జట్లకు టాస్ వేసిన ఈగ మల్లేశం.. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలను జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ముందుకు సాగాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి టోర్నమెంట్లు వారి నైపుణ్యాలను వెలికితీయడానికి దోహదపడతాయని అన్నారు. క్రీడా స్ఫూర్తితో పాటు క్రమశిక్షణను అలవర్చుకుని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు కల్పిస్తున్న ప్రత్యేక రిజర్వేషన్లు, ఇతర అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా టోర్నమెంట్ నిర్వహించిన సేవాలాల్ యూత్ సభ్యులను ఈగ మల్లేశం అభినందించారు.ఈకార్యక్రమంలో కరిమిల్ల సంపత్ రావు, జన్ను రాములు, ప్రభాకర్, రాము నాయక్, సంతోష్ నాయక్, రమేష్, నరేశ్‌తో పాటు యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.