హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026’ (ఎడిషన్–02) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ మారథాన్‌లో యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా 21కే హాఫ్ మారథాన్, 10కే టైమ్డ్ రన్, 5కే ఫన్ రన్ నిర్వహించారు.వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన రన్నర్లకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మెడల్స్ అందజేసి అభినందించారు. క్రీడలు, పరుగు పోటీలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.మారథాన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీసీపీ ధార కవిత, యువకులు, తదితరులు పాల్గొన్నారు.




